కలం ఏడుస్తోంది (Voice Of an News Reporter's Pen)
- Mast Culture

- Oct 9
- 1 min read
By Nripesh
కలం ఏడుస్తోంది
కష్టాన్ని గొంతు చించుకుని చెప్పిన తీర్చే నాధుడు లేడని.
కలం ఏడుస్తోంది
తన గొంతులో మాటలను నిమిరేస్తున్న అధికారులను చూసి.
కలం ఏడుస్తోంది
ఆదుకోవాల్సిన వాలే అరాచకాలు సృష్టిస్తుంటే, ప్రజలు ఇచ్చిన బలాన్ని, ప్రజల మీద చూపించే వాలని చూసి.
కలం ఏడుస్తోంది
ప్రజలను పాలించాల్సిన వల్లే వాలని అట బొమ్మలను చేసి ఆడిస్తుంటే, గొంతు ఎత్తి చెప్పగలిగిన గుణం ఉన్న కావలసిన మనిషి సహాయం దొరకడం లేదు అని.
కలం ఏడుస్తోంది
మనుషులు సృష్టించిన కాగితాల కోసం పోరాడుతూ, ప్రాణం విలువను మర్చిపోతున్న సాటి మనిషిని చూసి.
కలం ఏడుస్తుంది, ఏడుస్తూనే ఉంటుంది, కష్టాలు కడుపుకూతలుగా మారుస్తూ, కంఠంలో ప్రాణం ఆ నీలకంటేశ్వరుడికి చేరుస్తున్న మనుషులు ఉన్నంతవరకు.
By Nripesh



Comments