చెప్పాలి అని ఉంది నాన్న నీకు చెప్పాలని ఉంది.
- Mast Culture

- Oct 9
- 1 min read
By Nripesh
చెప్పాలి అని ఉంది నాన్న, నీకు చెప్పాలని ఉంది.
నువ్వు విడిచిన నీ పాదరక్షకులు, అరిగిపోవడానికి, తరగని మా అసలైన బరువే కారణం అని నాకు తెలుసు అని నీకు చెప్పాలి.
చెప్పాలి అని ఉంది నాన్న, నీకు చెప్పాలని ఉంది.
చీకటిలోని చెంపను జారే కన్నీరు, నీ మనసులో కలిగే ఆలోచనలు, నీ దిండు నాకు చెప్పుతుంది అని నీకు చెప్పాలని ఉంది.
చెప్పాలి అని ఉంది నాన్న, నీకు చెప్పాలని ఉంది.
నిన్ను కన్న వాళ్ళ కోసం, నువ్వు కన్నా వాళ్ళ కోసం, ఎన్ని సార్లు కన్నీరు కార్చావో నాకు తెలుసు అని చెప్పాలని ఉంది.
చెప్పాలి అని ఉంది నాన్న, నీకు చెప్పాలని ఉంది.
చింత లేని నీ చిరునవ్వు వెనక, చిగురించలేక వాడిపోయిన కలలు ఉన్నాయి అని, చెప్పలేక పోతున్న నీకు, నేను చెప్పలేను నాన్న, నాకు తెలుసు అని, నేను చెప్పలేను.
ఇన్ని తెలిసిన, నేను నీకు ఏమి చెప్పలేను.
ఎందుకు అంటే పడుతున్న వేదన కన్నా, ఆ వేదన ప్రేమించే మన వాళ్ళకి తెలుసు అనే ఆలోచన, ఇంకా వేదనకు గురి చేస్తది అని నాకు తెలుసు.
అందుకే నాకు చెప్పాలి అని ఉన్న, నేను చెప్పలేక పోతున్న నాన్న, నీకు చెప్పలేక పోతున్నాను.
By Nripesh



Comments