Kulam Kulam Ane Kakulam
- Mast Culture

- Oct 10
- 1 min read
By Gudimella D N G Bhavani
కులం కులం అనే కాకులం
కులం నిలువదురా ఎల్లకాలం
కులం వదిలి ,పట్టరా కలం
అప్పుడే కాగలవు అబ్దుల్ కలాం...
కులం కులం అనే కాకులం
కులం నిలువదురా ఎల్లకాలం
ప్రయత్నంతో చేస్తే ప్రయాణం, చేరుకోగలవు నీ విజయం
నువ్వు అవ్వాలి తరతరానికి ఆదర్శం
కులం కాకూడదు నీకు విషం...
కులం కులం అనే కాకులం
కులం నిలువదురా ఎల్లకాలం
కులం కాదురా నీ మార్గం
కులం కాకూడదు నీకు విశ్వాసం
కుల విబేధన ఒక రోగం...
కులం కులం అనే కాకులం
కులం నిలువదురా ఎల్లకాలం
కట్టె పెట్టే పైన ఉండదురా కులం,కట్టి పెట్టురా కులం కోసం నీ గళం...
కులం కులం అనే కాకులం
కులం నిలవదురా ఎల్లకాలం
కులం కులం కాదురా బలం,కులం లేనిదేరా ఈ దేశం...మన భారతదేశం
By Gudimella D N G Bhavani



Comments